హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇసుక విధానాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఇసుక లారీ యజమానుల సంఘం మండిపడింది. ఈ మేర కు సంఘం నాయకులు శుక్రవారం టీజీఎండీసీ చైర్మన్ సుశీల్‌కుమార్‌తో సమావేశమై వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శవంతమైన పాలసీని అమలు చేశారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ బుకింగ్‌లో మోసాలను అరికట్టాలని కోరారు. మరోవైపు ఇసుక డోల్ డెలివరీలో భాగం గా ప్రభుత్వం మార్పులు చేయనున్నదని సుశీల్ కుమార్ తెలిపారు. లోపాలుంటే సవరించాలని, మొత్తం విధానాన్ని మార్చి తే వినియోగదారులు, రవాణాదారులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. సమావేశంలో సంఘం నాయకులు యాదయ్యగౌడ్, రాజుగౌడ్, వెంకన్న, సలీం, జంగయ్య, బల్వంత్‌రెడ్డి, శ్రీశైలం, మహే శ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.