Road Accident | మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ని లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. లారీ డ్రైవర్ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైరింజన్ల సహాయంతో మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఓ పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.