Accidents | హైదరాబాద్ : రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం స్టేజ్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మద్దెల రమయ్య ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అచ్చంపేట – హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వాహనాలను క్లియర్ చేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
ఇవాళ ఉదయం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి ముందువెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కావలి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడి తలకు తీవ్ర గాయం కాగా, డ్రైవర్, కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. మిగతా ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనకు కారణమైన లారీ, బస్సు రెండూ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినవే. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు తేల్చారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని, డ్రైవర్, కండక్టర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద, అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ
ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అవ్వగా, తీవ్ర… pic.twitter.com/rBWvFAHjjd
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2025