హైదరాబాద్,జూన్ 19 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టులో ఉన్న కేసు లు కక్షిదారుల పరస్పర అంగీకారంతో రాష్ట్రంలోనే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే వెలుసుబాటు కలగనున్నది. సుప్రీం కోర్టు పెండింగ్ కేసులపై ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక లోక్ అదాలత్ ని ర్వహించబోతున్నారు. ఈ వివరాలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి బుధవారం సమావేశంలో వెల్లడించారు. మధ్యవర్తిత్వానికి యోగ్యమైనవి రాష్ట్రం లో 295 కేసులున్నట్టు గుర్తించామని, లేబర్, మెయింటెనెన్స్, సర్వీస్, కుటుం బ, చెక్‌బౌన్స్ లాంటి ఎన్ఐఏ యాక్ట్ కేసులతోపాటు కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిషారానికి ముందుకొస్తే మండల, జిల్లా, రాష్ట్రస్థా యి లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించవచ్చునని చెప్పారు. ఇరుపక్షాలు సంతకాలు చేస్తే వాటిపై సుప్రీంకోర్టు అవార్డు ఇస్తుందని వివరించారు. ఇప్పటికే మూడు కేసుల్లో కక్షిదారులు ముం దుకు వచ్చారని తెలిపారు. వివరాలకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 040-23446723 నంబర్లో సంప్రదించాలన్నారు.