లింగాల, మార్చి 27 : నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లి నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన యూరియా కాంగ్రెస్ నాయకుడు మేముల రాంచందర్దే అని స్థానికులు తెలిపారు. పలుకుబడి ఉన్న నేత కావడంతో అవసరానికి మించి యూరియాను నిల్వ చేసుకొని ఇతరులకు అధిక ధరకు బస్తాలు విక్రయిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
గురువారం రాత్రి బల్మూర్ మండలం లక్ష్మీపల్లికి తరలించేందుకు 20 బస్తాలను ఆటోలో వేయగా.. గ్రామస్తులు అడ్డుకొన్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్సై వెంకటేశ్వర్లుగౌడ్ను వివరణ కోరగా.. 20 బస్తాల యూరియాను పీఎస్‌కు తెచ్చిన మాట నిజమేనన్నారు.