ముత్తారం, జూన్ 20: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దర్యాపూర్ శివారులోని సర్వే నంబర్ 144, 145లో జేసీబీ సాయంతో ట్రెంచ్ పనులు చే యించేందుకు శనివారం రెవెన్యూ అధికారులు రావడంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు. ‘40 ఏండ్ల నుంచి సాగు చేసుకొని జీవిస్తున్నామని.. ప్రాణాలైనా ఇస్తాం గానీ.. భూముల్విమంటూ’.. పురుగులమందు డబ్బాలు, పెట్రోల్ బాటిళ్లతో నిరసన చేపట్టారు. దీంతో అధికారులు ట్రెంచ్ పనులను నిలిపివేశారు.