Nizamabad | స్థానిక సంస్థల ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత | నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కవిత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
కవిత గెలుపు లాంఛనమే..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 824 ఓటర్లకు గాను 84 శాతం మేర బలంతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు సునాయాసంగా మారింది. స్థానిక సంస్థల పోరులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బలం లేకపోవడంతో పోటీకి వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నిజామాబాద్లో కాంగ్రెస్ నేతలు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత గెలుపు లాంఛనప్రాయం కానునున్నది.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

