కల్యాణలక్ష్మి స్కీం ఎగ్గొట్టే యత్నం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎగ్గొటేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం మక్తల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్హెచ్-167 అంబేదర్ రస్తా వద్ద చేపట్టి న ధర్నాలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం పాల్గొని మాట్లాడారు.
- రేవంత్ సర్కార్పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఫైర్
- మక్తల్లో హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
మక్తల్, ఆగస్టు 17: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎగ్గొటేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం మక్తల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్హెచ్-167 అంబేదర్ రస్తా వద్ద చేపట్టి న ధర్నాలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భా రం కాకూడదని లక్ష్యంతో కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టి ఆడపిల్ల పెళ్లికి మేనమామగా అండగా నిలిచారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స మయంలో కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మి పథకాలకు అందజేసే లక్షా116తో పాటు, తులం బంగారం అం దజేస్తామని మ్యానిఫెస్టోలో హామీగా పెట్టి అధికారంలోకి వచ్చాక పథకాలన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కొవిడ్ వంటి ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం అందజేశారని, కానీ కాంగ్రెస్ ఆడబిడ్డలు తులం బంగారం గురించి ప్రశ్నిస్తున్నారని పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు సాయాన్ని అందించలేక కల్యాణలక్ష్మి అం శం హైకోర్టు పరిధిలో ఉందని తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు కల్యాణ లక్ష్మి పథకంపై నాలుగు దఫాలుగా గడువు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రేవంత్రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పై పూర్తిస్థాయిలో ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకొని, అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించాలని, లేకపోతే బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ఉద్యమాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీసీ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మక్తల్, మాగనూర్, ఉటూర్ మండ ల పార్టీ మాజీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, లక్ష్మీరెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు చిన్న హనుమంతు, సర ్పంచులు శ్రావణ్, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, నాయకులు అన్వర్ హుస్సేన్, మొగులప్ప, నర్సింహారెడ్డి, రామలింగం, జుట్ల సాగర్, రాజు, అమ్రేశ్, సాధిక్, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, బాలప్ప, ఆనంద్, ఆంజనేయులు, నాయకులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

