వేములవాడ, ఆగస్టు 28: రేషన్‌కార్డు లేని రైతులందరికీ రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడలో రూ.15 లక్షలతో నిర్మించిన సహకార సంఘం గో దాం, రూ.80.66 లక్షలతో నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 59 వేల మంది రైతులకు రూ.444 కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. రేషన్‌కార్డు లేనివారికి ప్రభుత్వం కు టుంబ నిర్ధారణ ప్రారంభించిందని, అధికారులు విచారణ చేసిన తర్వాత వారికి కూడా రుణమాఫీ అవుతుందని భరోసా ఇచ్చారు. రాజన్న ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వచ్చే కార్తీకమాసం నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
గురుకుల విద్యార్థులను కరిచిన ఎలుకలు ; నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి
దేవరకొండరూరల్, ఆగస్టు 28: నల్లగొం డ జిల్లాలోని గురుకుల వసతి గృహ విద్యార్థులను ఎలుకలు భయపెడుతున్నాయి. నాలు గు నెలల క్రితం డిండి బీసీ గురుకుల బాలిక వసతి గృహ విద్యార్థినులు ముగ్గురిని ఎలుక లు కొరకగా.. తాజాగా మరో ఘటన ఆలస్యం గా వెలుగుచూసింది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులో గల ఖాదర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న బీసీ గురుకుల బా లుర పాఠశాలలో నిద్రిస్తున్న 13 మంది వి ద్యార్థులను సోమవారం రాత్రి ఎలుకలు కరిచాయి. ఈ విషయాన్ని నిర్వాహకులు గోప్యం గా ఉంచారు. ఎలుకలు కరిచిన విషయాన్ని విద్యార్థులు.. ఉపాధ్యాయుడు, హెల్త్ సూపర్వైజర్కు చెప్పడంతో దగ్గరలో ఉన్న తూర్పుపల్లి పీహెచ్సీలో వైద్యం చేయించారు. ఆ వి ద్యార్థులకు ఏఆర్వీ ఇంజక్షన్ ఇచ్చినట్టు తల్లిదండ్రులు తెలిపారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా లేక ఎలుకలు విపరీతంగా ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు.