హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీ పీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ నేతలు విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితారాణాకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాకు 30చొప్పున 900 మాత్రమే ప్రారంభించాలనుకోవడం సరికాదని.. 50మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలలన్నింటిలోనూ ప్రారంభించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కే మల్లికార్జున్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శారద, సీహెచ్ శౌరి, సీహెచ్ ప్రభాకర్, ఏఆర్ బబితాకుమారిలు పాల్గొన్నారు.