Liquor shops | వైన్స్ బంద్.. నేటి సాయంత్రం 5 గంటల వరకు అమలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఆంక్షలు విధించింది.
- రేపు సాయంత్రం 5 గంటల వరకు అమలు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఆంక్షలు విధించింది. ఈ నెల 11న ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో సోమవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెం ట్లు బంద్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీచేశారు. ఓట్ల లెకింపు రోజై 13న కూడా వైన్స్, బార్లు, రెస్టారెంట్లు బంద్ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
అక్రమ విక్రయాలపై నిఘా
సోమవారం ప్రచారం ముగియడంతో తాయిలాలతో ఓటర్లను అభ్యర్థులు మభ్యపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మద్యం సరఫరా, అక్రమ విక్రయాలపై ఎక్సైజ్‌శాఖ నిఘా పెట్టింది. ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్‌షాపులను బం ద్ చేయించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్సులను రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
స్థానికేతరులు సర్దుకోవాల్సిందే!
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో స్థానికేతరులు ఎవరూ ఆ యా స్థానాల పరిధిలో ఉండొద్దని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీచేశా రు. స్థానికేతరులకు ఆశ్రయం కల్పిస్తే, సదరు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

