హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మధ్యాహ్న భోజన బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్లను బోధనకే పరిమితం చేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. కలెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సురేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లులు చెల్లించాలని, సస్పెండ్ చేసిన హెచ్ఎంలు, టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.