హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఉత్తరభారతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మరో ద్రోణి తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యలో ఏర్పడిందని పేర్కొన్నది.
వీటి ప్రభావంతో ఈనెల 15వరకు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. సోమవారం కామారెడ్డి జిల్లా తడ్వాయి మండలంలో 8.31 మి.మీ, బిర్కూర్ 8.09 మి.మీ, సదాశివానగర్ 7.55 మి.మీ, జుక్కల్ 7.52 మి.మీ, రామారెడ్డి 6.94 మి.మీ, బిచ్కుందా 6.14 మి.మీ, కామారెడ్డి 5.87 మి.మీ, డోంగ్లీ 5.40 మి.మీ, మధ్నూర్ 5.02 మి.మీ, నిజామాబాద్ జిల్లా పోతన్గల్ 5.85 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.