హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. అయితే గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని వెల్లడించారు. ఈ పరిస్థితి మరో మూడు రోజులు కొనసాగొచ్చని, అక్కడక్కడ చిరు జల్లులు కూడా కురువొచ్చని పేర్కొన్నారు.