ధర్మారం/రామడుగు, ఆగస్టు17 : కాళేశ్వరం అనుబంధ లింక్ -2 లోని పంప్‌హౌస్‌లలో ఐదు రోజులుగా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఆదివారం సైతం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో నాలుగు మోటర్లను నడిపించగా, ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెకుల చొప్పున 12,600 క్యూసెకులు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి నంది రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ సైతం 1, 2, 4, 6వ నంబర్ల పంపుల ద్వారా ఎత్తిపోస్తూ గ్రావిటీ ద్వారా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయానికి పంపిస్తున్నారు. ఐదు రోజుల్లో 3.3 టీఎంసీల నీటిని తరలించినట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.