హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పంపుతున్న సిఫార్సు లెటర్లను ఫిబ్రవరి 1 నుంచి అనుమతిస్తామని బోర్డులో తీర్మానం చేసినట్టు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 294 మంది ఎమ్మెల్యేలు పంపిన సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుని వసతి కల్పించడంతోపాటు, బ్రేక్ దర్శనానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేలకు పరిమితం చేయడం ఏంటని ప్రశ్నించారు.