హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : జింబాబ్వేలో ప్రస్తుతం కరువు తాండవిస్తున్నదని, అందుకు ప్రధాన కారణం చెట్లను నాటి, సంరక్షించకపోవడమేనని రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ తెలిపారు. చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను, జింబాబ్వే దుస్థితిని గుర్తు చేస్తూ ఆయన గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘జింబాబ్వేలో అడవులను నిర్మూలించడం తీవ్రమైన వాతావరణ సంక్షోభం, పర్యావరణ క్షీణతకు కారణమైంది. అందుకే నేను కూడా మన గురించి ఆందోళన చెందుతున్న. అలాంటి దుస్థితి మనకు రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ నా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో చేరి, మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్న. మనమంతా కలిసి మన దేశ సుస్థిర భవిష్యత్‌ను సృష్టిద్దాం’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జింబాబ్వేలో ప్రస్తుత తాండవిస్తున్న కరువుపై డెక్కన్ హెరాల్డ్ రాసిన కథనాన్ని ఈ పోస్టుకు ఆయన జత చేశారు.