హైదరాబాద్ : అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట తప్పిని బీజేపీపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నేతలు (TMHD) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ధర్నా చేపడుతామని ఆ సంఘం నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ..బీజేపీ అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ బిల్లు తెస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టలేదని బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ నుంచి మాదిగల సహకారంతో గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాడు.
అనేక సార్లు వర్గీకరణ చేస్తా అని మోసం చేశాడని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు ఇచ్చిన మాటను నిలబెట్టుకివాలి. లేదంటే మాదిగ ఉపకులాలతో కలిసి బీజేపీ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.