Leopard | నాగర్కర్నూల్ : నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం అధికమైంది. నల్లమల్ల అడవుల్లో ఉన్న గ్రామాల్లో చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తుంది. చిరుతల సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలో బుధవారం అర్ధరాత్రి ఓ చిరుత సంచరించింది. శ్రీశైలం ప్రధాన రహదారిపై నుంచి వెళ్లిన చిరుత.. ఇండ్ల మధ్యలోకి వెళ్లింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో చిరుత సంచారం దృశ్యాలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో మూడుసార్లు చిరుత పులి సంచరించడంతో.. భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు దృష్టి సారించి, చిరుతల సంచారాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
సీసీటీవీ ఫుటేజ్
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో అర్ధరాత్రి ఇళ్ల మధ్య సంచరించిన చిరుత పులి
వారం రోజుల్లో మూడుసార్లు సంచరించిన చిరుత పులి.. భయాందోళనలో గ్రామస్తులు pic.twitter.com/bFFrCqEcGy
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2025