Narayanpet | మరికల్, జూన్ 10 : మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామంలోని సంజీవ కొండ సమీపంలోని నిచ్చెనగట్టుపై మంగళవారం చిరుత సంచరించింది. గతంలో కూడా ఈ గట్టుపై చిరుత పశువులను వేటాడి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత భారీ నుంచి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై బీట్ అధికారి మల్లేష్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి చిరుత సంచారం చేస్తున్న విషయం తెలియజేస్తానని తెలిపారు.