Leopard | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆవుదూడపై దాడి చేసిన చిరుతపులి
Leopard | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. తంగళ్లపల్లి మండలంలో చిరుత వరుస దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం రామన్నపల్లెలో చిరుత ఆవుదూడ(Cow calf)పై దాడిచేసి చంపి తిన్నది. గ్రామానికి చెందిన జూపల్లి శ్రీనివాస్ ఎప్పటిలాగే తన పొలం వద్ద కట్టేశాడు. కాగా, ఉదయం వెళ్లి చూడగా ఆవుదూడ పై చిరుత దాడి చేసి చంపినట్లు పేర్కొన్నాడు.
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. తంగళ్లపల్లి మండలంలో చిరుత వరుస దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం రామన్నపల్లెలో చిరుత ఆవుదూడ(Cow calf)పై దాడిచేసి చంపి తిన్నది. గ్రామానికి చెందిన జూపల్లి శ్రీనివాస్ ఎప్పటిలాగే తన పొలం వద్ద కట్టేశాడు. కాగా, ఉదయం వెళ్లి చూడగా ఆవుదూడ పై చిరుత దాడి చేసి చంపినట్లు పేర్కొన్నాడు. ఇది ఇలా ఉండగా గతంలో కూడా పలుమార్లు చిరుత పశువులపై దాడి చేయడంతో మృతి చెందాయి. చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

