నిర్మల్ : నిర్మల్(Nirmal) జిల్లాలో చిరుత పులి(Leopard )సంచారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. సాయంత్రం అయిందంటే చాలు జనం ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలి పోతున్నారు. తాజాగా సారంగాపూర్ మండలం రవీంద్రనగర్‌లో చిరుత పులి సంచరించడం కలకలం రేపింది. ఈ క్రమంలో సహ్యాద్రి కొండల వద్ద మేకల కాపరిని(Gatherd) చిరుత పులి వెంబడించింది. దీంతో భయపడిన మేకల కాపరి ప్రాణభయంతో చెట్టు ఎక్కి కేకలు వేయడంతో చిరుత పులి వెనుదిరిగింది. కాగా, చిరుత పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని వారు కోరుతున్నారు.
Also Read..
Elephant | ఏనుగుతో సెల్ఫీ కోసం యత్నం.. తొక్కి చంపిన గజరాజు
Modi Laddu | ప్రధానిపై అభిమానం.. దీపావళికి ‘మోదీ లడ్డూ’.. ప్రత్యేకంగా తయారు చేస్తున్న వ్యాపారి