Manish Sisodia: కేజ్రీవాల్ రూట్లోనే సిసోడియా.. కోర్టుకు హాజరుకానన్న ఆప్ నేత
Manish Sisodia: అరవింద్ కేజ్రీవాల్ రూట్లోనే ఆప్ నేత మనీష్ సిసోడియా వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మ ముందు హాజరుకాబోనన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ జస్టిస్ స్వరణ కాంతకు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రూట్లోనే ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ కాంత శర్మ ముందు హాజరుకాబోనన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ జస్టిస్ స్వరణ కాంతకు లేఖ రాశారు. జస్టిస్ స్వరణ శర్మ కోర్టులో ఈ కేసు ముందు హాజరాకాబోనని కేజ్రీవాల్ సోమవారం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ ఆయన హాజరుకాబోనన్నారు. అయితే అదే తరహాలో ఇవాళ సిసోడియా కూడా లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని సిసోడియా పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియపై తనకు నమ్మకం లేదన్నారు.
ఇంకా ఆయన తన లేఖలో తీవ్ర విమర్శలు కూడా చేశారు. మీ పిల్లల భవిష్యత్తు తుషార్ మెహతా చేతుల్లో ఉందని సిసోడియా వ్యాఖ్యలు చేశారు. సిసోడియా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థతో పాటు రాజకీయా విభాగాల్లోనే తీవ్ర చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. తన కేసులో న్యాయవాదిని పెట్టుకోను అని, సత్యాగ్రహ బాటలో నడవనున్నట్లు సిసోడియా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

