England Squad : సొంతగడ్డపై జరుగబోయే మహిళల టీ20 వరల్డ్‌కప్(Womens T20 World Cup 2026) కోసం ఇంగ్లండ్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. నాటీ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ప్రపంచకప్ పోటీలకు సోమవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఆశ్చర్యంగా 18 ఏళ్ల అమ్మాయి టిల్లీ కార్టీన్ కొలెమన్ (Tilly Corteen-Coleman)ను సెలెక్టర్లు స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. ఈమధ్యే ‘ది హండ్రెడ్ లీగ్’లో అదరగొట్టిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ తొలి ప్రపంచకప్ ఆడనుంది.
పొట్టి వరల్డ్‌కప్ స్క్వాడ్ ఎంపికలో ఇంగ్లండ్ సెలెక్టర్లు అనుభవంతో పాటు ప్రతిభకు పట్టం కట్టారు. సీనియర్లకు చోటు కల్పించడమే కాకుండా స్పిన్ సంచలనంగా అవతరించిన 18 ఏళ్ల టిల్లీ కార్టీన్ కొలెమన్ను మెగా టోర్నీకి ఎంపి చేశారు. ఇటీవలే స్వదేశంలో ముగిసిన మహిళల ది హండ్రెడ్ లీగ్‌లో 9 మ్యాచుల్లోనే 11 వికెట్లు తీసిన ఈ టీనేజర్ .. సదర్న్ బ్రేవ్స్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం దేశవాళీ క్రికెట్లోనూ తిప్పేసిన టిల్లీ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లతో సెలెక్టర్ల దృష్టిలో పడింది. ప్రపంచకప్‌లో సీనియర్లు సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సే స్మిత్, చార్లీ డీన్‌తో కలిసి టిల్లీ స్పిన్ మ్యాజిక్ చూపించనుంది.
Uncapped Kira Chathli and Jodi Grewcock have been called up for England’s ODI series against New Zealand, while Tammy Beaumont has been left out.
Sophia Dunkley, Charlie Dean and Danni Wyatt-Hodge will miss the series to manage their workloads ahead of the T20 World Cup 🏴 pic.twitter.com/Ypb0bG1I8a
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2026
ఇంగ్లండ్ స్క్వాడ్ : నాట్ సీవర్ బ్రంట్, లారెన్ బెల్, అలిసే క్యాప్సే, టిల్లి కార్టీన్ కొలెమన్, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎకిల్‌స్టోన్, లారెన్ ఫైలెర్, డాని గిబ్సన్, అమీ బోన్స్, ఫ్రెయా కెంప్, హీథర్ నైట్, లిన్సే స్మిత్, ఇస్సీ వాంగ్, డానీ వ్యాట్ హొడ్గే.
స్క్వాడ్ ఎంపిక అనంతరం హెడ్‌కోచ్ చార్లొట్టే ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. ‘మేము ప్రపంచకప్ స్క్వాడ్‌ను ప్రకటించాం. చాలా కష్టంగా అద్భుతమైన 15 మందిని ఎంపిక చేశాం. సెలెక్షన్ చాలా కష్టంగా అనిపించింది. ప్రతిభావంతులైన చాలామందికి స్క్వాడ్‌లో చోటు దక్కింది. మేము కోరుకున్న జట్టు ఇది. కఠినమైన నిర్ణయాలను సైతం మేము తేలికగా తీసుకోమని చెప్పడానికి ఇది నిదర్శనం.
BREAKING: Hosts England announce their squad for the upcoming Women’s #T20WorldCup 🚨
Uncapped 18-year-old spinner Tilly Corteen-Coleman has been included, while Lauren Filer and Issy Wong will feature at their first T20 World Cup 🏴 pic.twitter.com/yrXBABCqJs
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2026
స్వదేశంలో ప్రపంచకప్ ఆడనుండడం ప్రత్యేకమైన ఫీలింగ్’ అని తెలిపింది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. మెగా టోర్నీకి మరో నెల రోజులే ఉన్నందున సన్నాహక సిరీస్‌లో ఆడనుంది నాట్ సీవర్ బృందం. న్యూజిలాండ్, భారత్ జట్లతో తలపడనుంది.