కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని దగ్గి-చాంద్రాయణపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి (Leopard) మృతిచెందింది. గురువారం రాత్రి జాతీయ రహదారి 44పై ఈ ఘటన చోటుచేసుకున్నది. గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.