బిజినేపల్లి : నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా బిజినేపల్లి(Bijinepalli) మండల కేంద్రం సమీపంలో గురువారం రాత్రి మళ్లీ చిరుత పులి(Leopard) దూడపై దాడి(Aattack) చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్ష అనే రైతు సమీపంలోని తన వ్యవసాయ పొలంలో పశువులను కట్టేసి ఇంటికెళ్లాడు.
శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా దూడపై చిరుత పులి దాడి చేసి చంపేసినట్లు తెలిపారు. చిరుత పులి దాడులు వరుసగా జరుగుతుండడంతో చుట్టుపక్కల తండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత పులిని పట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.