చెన్నై: భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ చెన్నై ఓపెన్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. భారత నెంబర్ వన్ టెన్నిస్ ర్యాంక్ కల్గిన నాగల్.. ఈ టోర్నీ రెండో రౌండ్లో 6-4, 6-7 (7/2), 3-6తో పెట్ బర్ బిర్యొకువ్ (రష్యా) చేతిలో ఓటమిపాలయ్యాడు.
పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో భారత ఆటగాడు టాప్ సీడ్ నికి కలియంద పూనాచా-ప్రుచ్య ఇసారొ (థాయ్‌లాండ్) ద్వయం.. 6-4, 6-1తో భారత్‌కే చెందిన బద్రినాథ్-శన్ముగంను ఓడించి సెమీస్‌కు చేరింది.