హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని యాచారం (Yacharam) మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా మండలంలో సంచరిస్తూ పశువులు, మేకలపై దాడిచేస్తున్నది. బుధవారం ఉదయం తాడిపత్రిలో మేకపోతుపై దాడిచేసి తినేసింది. మంగళవారం పొలం వద్ద ఉన్న ఆవుపై దాడిచేసి చంపింది. ఇలా చిరుతపులి వరుసగా దాడులు చేస్తుండటంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని చెప్పారు. సధ్యామైనంత తొందరగా చిరుతను బంధిస్తామని చెప్పారు.