Leopard | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. జూలురుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం చేస్తోందని రైతులు తెలిపారు. ఓ రైతు మిర్చి పంట వద్ద కుక్కను కాపలా ఉంచాడు. ఆ కుక్కపై చిరుత దాడి చేసి చంపింది. అనంతరం కుక్కను సమీప అడవుల్లోకి లాక్కెల్లింది చిరుత.
చిరుత సంచారాన్ని రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఆర్వో ప్రసాద రావు తన సిబ్బందితో చిరుత సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. చిరుత సంచారం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జూలురుపాడు మండలంతో పాటు ఏక్నూర్, తల్లాడ మండల ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత జాడ కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాని అధికారులు చెప్పారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు కర్రలు తప్పనిసరిగా తీసుకెళ్లాలని, గుంపులు గుంపులుగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | వెంటనే రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
Revanth Reddy | హైదరాబాద్కు మూడు వైపులా సముద్రం ఉన్నదట.. రేవంత్ వ్యాఖ్యలు