ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా సాగాయి. వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రంగారెడ్డి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులు జాతీయ జెండాలతోపాటు బీఆర్ ఎస్ జెండాలను కూడా ఆవిష్కరించారు. తెలంగాణ సాధనకోసం అమ రులైన వారిని స్మరించుకుని ఘన నివాళులర్పించారు.
వికారాబాద్, జూన్ 2 : సంక్షేమ పథకాల అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి..జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిధి పెంపు, భూభారతి తదితర పథకాల గురించి వివరించారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన వీక్షించారు. అంతకుముందు వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రసాద్‌కుమార్ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్‌ప్రసాద్, అదనపు ఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో వాసుచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : రాష్ట్ర అభివృద్ధే అమరులకు అసలైన నివాళి అని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ.. నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం స్ఫూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమే కం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిధి పెంపు, భూభారతి తదితర పథకాల గురించి వివరించారు.
కాగా అవతరణ వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరింపజేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన జ్ఞాపికలను అందజేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను వీక్షించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పం పిణీ చేశారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణ లో అమరవీరుల స్మారక స్తూపం వద్ద వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, శంకర్, ఆర్డీవో సంగీత, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అ నంతరెడ్డి, అధికారులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో రాష్ట్ర పట్టణ, ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.