ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:13:30

నృత్యకారిణి శోభానాయుడు ఇక లేరు

నృత్యకారిణి శోభానాయుడు ఇక లేరు

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సుప్రసిద్ధ కూచిపూడి నృత్యకారిణి, అధ్యాపకురాలు, పద్మశ్రీ డాక్టర్‌ శోభానాయుడు (64) కన్నుమూశారు. న్యూరోలాజికల్‌ సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శోభానాయుడు మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. సత్యభామ, పద్మావతి వంటి పాత్రలకు తన నృత్యంతో శోభానాయుడు ప్రాణంపోశారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంతోమంది నృత్యకళాకారులను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని కాంక్షించారు. ఆమె కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శోభానాయుడు.. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో వెంకటనాయుడు, సరోజినీదేవి దంపతులకు జన్మించారు. శోభానాయుడు మృతి తెలుగు కళాప్రపంచానికి తీరని లోటని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జీ చంద్రయ్య పేర్కొన్నారు. 


logo