Warangal | వరంగల్‌లో కేంద్ర బడ్జెట్‌పై వామపక్ష పార్టీల నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేఖిస్తూ వామపక్ష పార్టీలు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
వరంగల్ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేఖిస్తూ వామపక్ష పార్టీలు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం ఎంసీపీఐ (యూ) నగర కార్యదర్శి మాలోతు సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పాల్గొని బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. దేశానికి దిశానిర్దేషం చేసే బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తుల కోసమే రూపొందించినట్లుగా ఉందని అన్నారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ దేశీయ వ్యవసాయానికి, గ్రామీణ, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే విధంగా బడ్జెట్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహయ కార్యదర్శి నర్ర ప్రతాప్, కార్యవర్గ సభ్యులు సుంచు జగదీష్, రామస్వామి, నాగుష్, మెహబూబ్, గోవర్ధన్, రాజు, ప్రభాకర్, నర్సయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో
సీపీఎం నాయకులు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం జిల్లా కమిటీ సభ్యురాలు రత్నమాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రాధాన్యత లేకుండా, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నాన్ని విస్మరించి, వ్యవసాయ కూలీలకు సైతం ప్రయోజనాలు లేకుండా రూపొందించిన కేంద్ర బడ్జెట్లో వెంటనే మార్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లాకు మొండి చెయ్యి ఇచ్చారని అన్నారు. గతంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులు కేవలం 20కోట్లు మంజూరు చేసి ఈ సంవత్సరం కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల ఊసేలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వలదాసు దుర్గయ్య, కుమార్, బషీర్, ప్రశాంత్, సాంబమూర్తి, సందీప్, ప్రభాకర్, అనిల్, వాణి, కవిత, దినోత, రాజు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Cpm
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

