హైదరాబాద్ : సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల(Left leaders )ఆధ్వర్యంలో లగచర్ల ఫార్మసిటీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) ఈరోజు సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ బృందంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ తదితరులు పాల్గొంటారు. కాగా, లగచర్లలో ఇటీవలే సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వామపక్ష నేతలతో కలిసి పర్యటించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు. నేడు అధికారం చేపట్టాక మాట మార్చాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక ప్రగతి భవన్ ముందున్న గేట్లు కూల్చి వేశాడు. అదొక్కటి తప్పా ఆయన చేసే పనులన్నీ అప్రజాస్వామ్యకంగానే నడుస్తున్నాయన్నారు. హైడ్రా కూల్చి వేతలు, మూసీ పరీవాహక ప్రాంతం, గ్రూప్ వన్ ఎగ్జామ్, దామగుండం ఇలా ప్రతి పనిని ఏకపక్షంగా చేశారని మండిపడ్డారు.
లగుచర్లలో ఫార్మా సిటీ పేరుతో గిరిజనుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. గతంలోనే ఫార్మా సిటీ కోసం 13 వేల ఎకరాలు సేకరించారు. దానిపై రేవంత్ రెడ్డి వైఖరేంటో చెప్పాలన్నారు. ఇప్పుడు మళ్లీ లగుచర్లలో 13 వందల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన అప్రజాస్వామికంగా కొనసాగుతుందని విమర్శించారు.