తరిగొప్పుల, జనవరి 19 : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపురం, అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు( Congress Party) బీఆర్ఎస్ పార్టీలోచేరారు. ఆదివారం జనగామ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్టాడుతూ… అర్హులందరికీ పథకాలు అందేలా కృషి చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మ్హన్రెడ్డి, అధికార ప్రతినిధి చిలివేరు లింగం, నాయకులు జొన్నగోని సుదర్శన్‌గౌడ్, ముద్దసాని వెంకట్‌రెడ్డి, అర్జుల సంపత్‌రెడ్డి, జార్జిరెడ్డి, మాజీ ఎంపీపీ నూకల కృష్ణమూర్తి, భూక్యా జూంలాల్‌నాయక్, మాజీ సర్పంచ్ ముక్కెర బుచ్చిరాజ్ యాదవ్, పోగుల అశోక్‌కుమార్, తాళ్లపల్లి పోషయ్య, భూక్యా రవి పాల్గొన్నారు.