హైదరాబాద్, జనవరి 28 : ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఐదేండ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ సీఎండీ అమితావ ముఖర్జీ తెలిపారు.
ఈ పెట్టుబడులు కేవలం వ్యాపార అవసరాలకోసం కాకుండా, అంతర్జాతీయ మైనింగ్ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వినియోగించనున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్లో వాటాదారులతో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజన్ 2030ని ప్రకటించారు. వచ్చే ఐదేండ్లలో ఖనిజ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.