హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. గులాబీ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, యువకులు భారీగా ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం.. జల్గావ్ జిల్లాలో కొద్ది రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లాలోని అన్ని తాలూకాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో జల్గావ్ జిల్లా నుంచి భారీగా గులాబీ పార్టీలో చేరారు. జల్గావ్ జిల్లా రైతు నాయకుడు నానాసాహెబ్ బచావో నేతృత్వంలో మూడుసార్లు జడ్పీ సభ్యులుగా పనిచేసిన శివాజీ నానా పాటిల్, రైతు కవి, రచయిత సంతోష్పాటిల్, పారిశ్రామికవేత్త అతుల్జీ జగ్తాప్, విక్రమ్ పాటిల్, నితిన్ బావు తైదే, రైతు సంఘర్ష్ సంఘం జల్గావ్ జిల్లా అధ్యక్షుడు, సాధన్ బావిసార్ భికాన్ సోదరుడు సాంహేబ్వాన్.
దేవేంద్ర వరదే, కైలాశ్ పాటిల్, సురేశ్ పాటిల్, భుసావల్ ధ్యానేశ్వర్ పాటిల్, కునాల్ పాటిల్, విజయ్ పాటిల్, రవీంద్ర పాటిల్, నీలేశ్ మహాజన్, దినేశ్ మల్గిరే, సంజయ్, స్వప్నిల్ బోర్సేచ సందీప్ పాటిల్, రాహుల్ సోనావనే, సంతోష్ పాటిల్, రమేశ్ కదం, విజయ్ సాలుంఖే, దీపక్ రాజ్పుత్, జయంత్ సోనావనే, గణేశ్ పాటిల్, ప్రకాశ్ మహాజన్, రావుసాహెబ్ బాలేరావ్ పాట్చో, విజయ్ గులాబ్ పాటిల్, పాచోల్ నీలకంఠ్తోపాటు అనేక మంది యువకులు పార్టీలో చేరారు. వారికి మాణిక్రావు గులాబీ కండువాలను కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విస్తరణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.