హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): స్పౌజ్‌లను ఒకే జిల్లాకు కేటాయించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) నేతలు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను యూనియన్ నేతలు కలిసి వేర్వేరుగా వినతిపత్రాలను అందజేశారు.
పరిశుభ్రతకు సర్వీస్పర్సన్స్ను నియమించాలని, మేజర్ పంచాయతీలలో ఆదర్శ పాఠశాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్‌తోపాటు బూట్లు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం, వనం వెంకటేశ్వర్లు, రామకృష్ణ పాల్గొన్నారు.