సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ) : ఆటో డ్రైవర్ల ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సోమవారం పలు ఆటో సంఘాల యూనియన్ నేతలు(Auto Union) రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ , టీఎస్పీటీఎంఎంల ఆధ్వర్యంలో మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లారు.
ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం విషయంలో పునరాలోచన, బస్సుల సంఖ్య తగ్గించాలని, ఓలా, ఉబర్, ర్యాపిడ్ బైక్‌ల అక్రమ వ్యాపారాన్ని నిషేదించాలని, తదితర డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలోనే ఆటో సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్ ఆటోయూనియన్ నేతలు రవిశంకర్ అల్లూరి, శ్రీనివాస్ ముదిరాజ్, ఎండీ హబీబ్, సంతోష్‌గౌడ్, ఈశం శంకర్, తదితరులు ఉన్నారు.