LB College | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్‌నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ ఎన్సీసీ పర్యవేక్షణలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని తిరుపతి కొండల్లో జాతీయ పర్వతారోహణ క్యాంపులో ఎల్బీ కళాశాల విద్యార్థులు నిఖిల్, రామ్‌చరణ్ పాల్గొంటున్నారని, ఈనెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు కొనసాగే ఈ క్యాంపు కాలేజీ క్యాడెట్స్ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పర్వతారోహణ క్యాంపులో మంచి ప్రతిభ కనబరిచి, కళాశాలకు, వరంగల్‌కు మంచిపేరు తీసుకురావాలని, ఇతర క్యాడెట్స్‌కు, విద్యార్థులకు రోల్‌మోడల్‌గా నిలవాలని ప్రిన్సిపల్‌తో పాటు కాలేజీ చైర్మన్ ప్రొఫెసర్ భాగ్యనారాయణ, సెక్రెటరీ వినయ్‌కుమార్, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎం.సదానందం అభినందించారు.