మహబూబ్నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యర్తలు రెచ్చిపోతున్నారు. అధికారం అండ చూసుకొని ఇష్టా రీతిగా ప్రవర్తిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో(Social media) పోస్టులు పెడితే తొక్కి చంపుతామని
మహబూబ్నగర్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్(Laxman Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి గురించి బీఆర్ఎస్ నేతలతో తాము చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తమ కార్యకర్తలు తొక్కి చంపుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ మరో కాంగ్రెస్ నేత అన్నారు. ఇప్పుడు వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ప్రజాస్వా మ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు అహంకారపూరిత వ్యాఖ్యలపట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.