నందిగామ, మార్చి11: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మొదల్లగూడ శివారులో ఉన్న ఇంటర్నేషనల్ సింబయాసిస్ డీమ్డ్ వర్సిటీలో (Symbiosis university) విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఢిల్లీకి చెందిన షాగ్నిక్ వర్సిటీ హాస్టల్లో ఉంటూ లా మూడో ఏడాది చదువుతున్నాడు. సోమవారం రాత్రి వాష్ రూమ్‌కి వెళ్లిన షాగ్నిక్.. అందులోనే కింద పడిపోయి విగతజీవిగా ఉన్నాడు. గుర్తించిన విద్యార్థులు అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆయన మృతికిగల కారణాలు తెలుస్తాయన్నారు. కాగా, షాగ్నిక్ గుండెపోటుతో మరణించినట్లు వర్సిటీ యాజమాన్యం వెల్లడించింది.