Telangana Tourism | నందికొండ, అక్టోబర్ 26 : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని నవంబర్ 2 నుం చి ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్ ఫీడ్ జీఎం ఇబ్ర హీం శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. వన్‌వేకు పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600, రానుపోను పెద్దలకు రూ.3వేలు, పిల్లలకు రూ.2,400 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నట్టు తె లిపారు. వివరాలకు 984854037 1, 98481258720, 79979510 23 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మైనింగ్ అధికారులకు జరిమానా
హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అలస త్వం, అవకతవకలకు పాల్పడిన గను ల శాఖకు చెందిన పూర్వ సంయుక్త సంచాలకుడు కే లక్ష్మణ్‌బాబు, ఉపసంచాలకుడు కే నర్సింహారెడ్డి, సహాయసంచాలకుడు ఆర్ ప్రవీణ్, ఎస్ సైదు లు, జీ నిరంజన్‌పై రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నిబంధనలు-1991 ప్రకారం క్రమశిక్షణాచర్యలతోపాటు జరిమానా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.