యువతపై లాఠీచార్జి దారుణం
సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల తలపెట్టిన చలో పార్లమెంట్ సందర్భంగా జెన్ జీ ఉద్యమకారులపై లాఠీలు ఝులిపించడం, పెల్లెట్లను ప్రయోగించడం దారుణమని, ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. బు
- ప్రధాని మోదీ, అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి
- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల తలపెట్టిన చలో పార్లమెంట్ సందర్భంగా జెన్ జీ ఉద్యమకారులపై లాఠీలు ఝులిపించడం, పెల్లెట్లను ప్రయోగించడం దారుణమని, ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతితో కలిసి రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కాకుండా, ప్రతిపక్షాల ఎంపీలను చీల్చి గత సమావేశాల్లో వీగిపోయిన బిల్లులను ఆమోదించేందుకు పార్లమెంట్ సమావేశాలు పెట్టినట్టు ఉన్నదని విమర్శించారు.
జెన్ జీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను క్షమిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించడం విద్యార్థుల పోరాటాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. డీలిమిటేషన్, మహిళా బిల్లును కలిపి పెట్టినందునే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించాయని, మహిళా బిల్లును విడిగా పెడితే మద్దతు తెలిపేవని స్పష్టంచేశారు. కేంద్ర అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న తలపెట్టిన జైల్‌భరోకు మద్దతిస్తున్నట్టు చెప్పారు. బీహార్‌లోని బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ గెలుపు బీజేపీకి చెంపపెట్టు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

