కొల్లాపూర్ : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్( KCR ) ఫోన్ టాపింగ్ పేరుతో నోటీసులు ఇవ్వడం పట్ల నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) దిష్టిబొమ్మల ఊరేగింపులతో పాటు పల్లెలు దద్దరిల్లాయి. గ్రామాల్లో ఉదయం తొమ్మిది గంటలకే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయగా మరి కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తల మధ్య కొనసాగాయి.

కొల్లాపూర్ ( Kollapur ) పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను పురవీధులలో ఊరేగించారు. ఎన్టీఆర్ సర్కిల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా వారి చేతిలో నుంచి దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని తీసుకొని వెళ్లారు. రెండవసారి అంబేద్కర్ సర్కిల్లో రేవంత్ రెడ్డి బొమ్మను దగ్ధం చేస్తుండగా మరోసారి పోలీసులు వచ్చి దిష్టిబొమ్మను లాక్కొని ఎవరికి దొరకకుండా బైక్ పై వెళ్లారు.
పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు రాజా శేఖర్ రాముడుపై ఎస్సై రామన్ గౌడు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.

మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేస్తుందన్నారు. రెండు సంవత్సరాలు ఫోన్ టాపింగ్ పేరుతో కెసిఆర్ కుటుంబానికి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . పెంట్లవెళ్లి మండలం మంచాలకట్ట గ్రామంలో పోలీస్ చేతిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులను ఆయన పరామర్శించారు.