Mortality Rate | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ఏడాది ప్రసూతి మరణాలు తగ్గినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదుకాగా, 2023-24లో 260కి తగ్గినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోనే అతి తక్కువ ప్రసూతి మరణాలు నమోదవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. ప్రసూతి మరణాలపై నివేదికను విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.