హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ ఇతర జలాశయాల నిర్మాణం వల్ల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని 2023లో ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంతో.. ఏజీ హామీ ప్రకారం తమకు సొమ్ము చెల్లించలేదంటూ బాధితులు నిరుడు మార్చి 30న మళ్లీ కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు.
ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై బుధవారం జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి విచారణ చేపట్టడంతో పిటిషనర్లకు ప్రభుత్వం మంగళవారం పరిహారం అందజేసిందని, కానీ ఆ సొ మ్ముపై వడ్డీ, ఇంటి జాగా ఇవ్వలేదని తెలిపారు. విచారణకు సందీప్‌కుమార్ సుల్తానియా ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు.విచారణను ఈనెల 17కి వాయిదా వేశారు. సుల్తానియాపై కోర్టుధికరణ పిటిషన్ మూసివేతకు నిరాకరించారు.