Liquor Shops | రేపే చివరి రోజు.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోండి.. ప్లీజ్..!
Liquor Shops | రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణకు శనివారమే చివరి రోజు. నిన్నటి వరకు కేవలం 25 వేల మద్యం దరఖాస్తులే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
Liquor Shops | హైదరాబాద్ : రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణకు శనివారమే చివరి రోజు. నిన్నటి వరకు కేవలం 25 వేల మద్యం దరఖాస్తులే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
బుదవారం వరకు 9,600 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి.. రేపే చివరి రోజు కావడంతో.. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రావేమో అని అధికారులు దిగులు చెందుతున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ పడిపోవడం, బిజినెస్ తగ్గిపోవడం లాంటి కారణాలు ఉన్నా కూడా వ్యాపారులు సిండికేట్లాగా ఏర్పడి పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది మద్యం దుకాణాల కోసం 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి దారుణంగా డిమాండ్ పడిపోయింది. ఈసారి లక్ష లోపే మద్యం దరఖాస్తులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
దరఖాస్తులు చేయండి ప్లీజ్..
మద్యం దరఖాస్తుల కోసం అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోండి అని గతంలో దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు SMSలు పెట్టి వేడుకుంటున్నారు. గతంతో పోలిస్తే దరఖాస్తులు ఈ సారి తక్కువగా వస్తుండంతో.. మద్యం టెండర్ల కోసం దరఖాస్తులు పెంచడానికి మెసేజీలు పెట్టి మరీ తిప్పలు పడుతున్నారు అధికారులు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

