హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లి సర్వేనంబర్ 245-19లోని భూయజమానులకు పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని సివిల్ కోర్టు సూచించినట్టు బాధితురాలి తండ్రి సతీశ్‌షా తెలిపారు. గత నెల 30న తన స్థలంలోకి అక్రమంగా చొరబడి ప్రహరీని కూల్చివేసినట్టు సుధీర్‌షా, అవినాష్షా, అక్షయ్షా, అమిత్‌షాతో పాటు న్యూజన్ బిల్డర్స్, రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్పై పల్లవిషా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ప్రత్యర్థి వర్గం వారి నుంచి పలు రకాల ఒత్తిళ్లు వస్తుండటంతో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం పల్లవి షా కుటుంబానికి పోలీసు ప్రొటెక్షన్ కల్పించడంతో పాటు వివాదాస్పద స్థలంలో కూల్చివేసిన ప్రహరీని పోలీసు రక్షణ మధ్య పునర్నిర్మించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసినట్టు పల్లవిషా తండ్రి సతీశ్ షా తెలిపారు.