మక్తల్, ఫిబ్రవరి 22 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల సర్వే పో లీసుల పహారాలో కొనసాగుతున్నది. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్ మం డలం కాట్రేవ్పల్లి శివారులో రైతులకు తెలియకుండా భూ సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకొన్న కర్షకులు పొలాల వద్దకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఏండ్ల తరబడి వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్న తమ జీవితాల్లో ప్రాజెక్టు పేరిట చీకటి నింపుతున్నారని మండిపడ్డారు. భూమిని కోల్పో యి ఎలా బతకాలని గుండె బరువెక్కిన రైతు ఊషన్నగౌడ్ దవాఖాన పాలయ్యా డు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల భూసర్వే చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.