హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూ సమస్యల వివాదాలపై తీర్పులిచ్చే అధికారం సివిల్ కోర్టులదేనని రెవెన్యూ అధికారులది కానేకాదని హైకోర్టు స్పష్టంచేసింది. గచ్చిబౌలిలోని వివాదాస్పద భూములపై రక్షిత కౌలుదారులకు హకులున్నాయని చెప్పింది. ఈ మేరకు 2013లో ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులు సమర్థనీయమని తెలిపింది. 2016లో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. పిటిషనర్లు చట్టప్రకారం కౌలుదారులని, వ్యవసాయ భూముల చట్టం- 1950 ప్రకారం యాజమాన్య హకులు కల్పిస్తూ ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులు కరెక్టేనని చెప్పింది. చట్టంలోని సెక్షన్ 19 కింద అద్దె హకులను చట్టబద్ధంగా వేరొకరికి అప్పగించినట్టు ఆధారాలు లేవని పేర్కొంది.
ఈ ఉత్తర్వులను జాయింట్ కలెక్టర్ పకకు పెట్టడాన్ని తప్పుపట్టింది. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సీవీ భాసర్రెడ్డి తీర్పు వెలువరించారు. కౌలుహకుల నిర్ధారణ అధికారం ఆర్డీవోదేనని చెప్పారు. ఈ భూములను తాము కొనుగోలు చేశామని డైమండ్ హిల్స్ అసోసియేషన్, దాని సభ్యులు, ఇతరులు వేసిన పిటిషన్లను కొట్టివేశారు. వ్యవసాయ భూముల్ని నివాస ప్రాంతంగా మార్చినందున రైతులకు కౌలు హకులు ఉండవని జాయింట్ కలెక్టర్, ఆర్డీవో ఉత్తర్వులను పకన పెట్టడంపై సందేహాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు సుమారు 150 పేజీల తీర్పును వెలువరించారు. గచ్చిబౌలిలోని పలు సర్వే నంబర్లలోని సుమారు 190.17 ఎకరాల వివాదాస్పద భూముల్లో 36.7 ఎకరాలపై హకులు రక్షిత కౌలుదారులువేనని తేల్చి చెప్పింది.